Breaking News

అమరావతి రైతులకు 109 రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తుళ్లూరు, నేలపాడు, రాయపూడి, బోరుపాలెం, లింగాయపాలెం, వెలగపూడి గ్రామాలకు చెందిన రైతులకు శనివారం 2026 ఆగస్టు 1న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా 109 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. రాజధాని నిర్మాణానికై ఇటీవల భూములు ఇచ్చిన రైతులకు, అలాగే గతంలో ప్లాట్లు పొంది..అట్టి ప్లాట్లు వీధి పోటు, కోర్ట్ కేసులు, భూసేకరణ చేయాల్సిన స్థలాలలో ప్లాట్లు పొందిన వారి తెలియజేసిన విజ్ఞప్తులను పరిశీలించి..అర్హులైన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ- లాటరీ ద్వారా ఈ రోజు కేటాయించడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు APCRDA డైరెక్టర్(ల్యాండ్స్)- క్యాపిటల్ సిటీ కె.ఎస్.భాగ్యరేఖ, ఇతర ముఖ్య అధికారులతో కలసి ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు అందజేశారు. మొత్తంగా 25 మంది రైతులకు శనివారం 109 ప్లాట్లను కేటాయించారు. వీటిలో 74 రెసిడెన్షియల్ ప్లాట్లు కాగా, 35 కమర్షియల్ ప్లాట్లు.

ఈ కార్యక్రమం నిర్వహించిన భాగ్యరేఖ గారు..రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. ప్లాట్లు పొందిన రైతులు భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జి.సాయి శ్రీనివాస నాయక్, పి.పద్మావతి, జి.మురళీధర్, ఎం.శేషిరెడ్డి, ప్లానింగ్, ల్యాండ్స్, GIS విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *