-ఈరోజు పుస్తకం చదివే పిల్లవాడే రేపటి విజ్ఞానవంతుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ప్రతి ఆదివారం నిర్వహించే చదవటం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా నెలలో మొదటివారం పుస్తక ప్రదర్శన నిర్వహించబడుతుంది. పుస్తక ప్రదర్శనలో విద్యార్థుల కొరకు కథలు, దేశ నాయకుల చరిత్రలు సైన్స్, ప్రాజెక్టులు, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ మొదలగు బుక్స్ ప్రదర్శించారు. గ్రంధాలయాలు అధికారి రమాదేవి మాట్లాడుతూ పిల్లలుకు చిన్నప్పటి నుంచే పుస్తక పటనంఅలవాటు చేయటం వల్ల జీవితాంతం ఉపయోగపడే మంచి అలవాటుగా మారుతుంది. భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఇందు మూలంగా జ్ఞానం పెరుగుతుంది. నైతిక విలువలు పెంపొందుతాయి మంచి కథలు జీవిత చరిత్రలు చదవటం వల్ల పిల్లల్లో నిజాయితీ, కరుణ, సేవ భావం వంటి విలువలు పెంపొందిస్తాయి. మొబైల్ ,టీవీ వంటి వాటికి బదులుగా పుస్తకాలపై ఆసక్తి పెరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే పుస్తక పటనం అలవాటు చేయాలని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ వల్లభనేని సుమతి, మల్లెల వరలక్ష్మి వివిధ స్కూల్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News