మోడీజీ 15 లక్షలు ఎప్పుడు వేస్తారు…

-జి.కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో మొలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి రప్పించి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతున్న ఏ ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేయకపోవడం శోచనీయమని సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు అన్నారు. సిపిఐ 50వ డివిజన్ పార్టీ సభ్యుల సమావేశం కామ్రేడ్ పిట్ట అప్పారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలపై పారాలు వేస్తూ, ప్రజల నడ్డి విడిచింది అన్నారు అందుకే సిపిఐ జాతీయ సమితి ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార యాత్రలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందని, కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు నగరంలోని పార్టీ సభ్యులు, శ్రేణులు అందరూ సమైక్యంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు లు తాడి పైడయ్య, డివిజన్ పార్టీ కార్యదర్శు మోకా దుర్గారావు లు పాల్గొని పదవ తేదీ వారి డివిజన్లో జరిగే ప్రచార యాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *