ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
పురాణాల ప్రకారం మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకములోని సమస్యలు తొలగి,అన్ని పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందనే పురాణోక్తి ప్రకారం ఆది పరాశక్తి, జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకట హర చతుర్థి సందర్బంగా దేవస్థాన యాగశాలలో ఈరోజు ఉదయం గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం కార్యక్రమములను ఆలయ అర్చకులు వైభవంగా జరిపించారు. లోక క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tags indrakiladri
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News