విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు నాటకరంగ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహానటుడు, నాటక పితామహుడు బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయమని విజయవాడ నగర పాలక సంస్థ పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) వి. చంద్రశేఖర్ కొనియాడారు.ఆదివారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద బళ్లారి రాఘవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ ఇంజనీర్ వి. చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఉంటూనే నాటకరంగంపై ఉన్న మక్కువతో సామాజిక స్పృహ కలిగిన ఎన్నో అద్భుతమైన పాత్రలకు బళ్లారి రాఘవ ప్రాణప్రతిష్ఠ చేశారని గుర్తుచేశారు. నాటకాల్లో కేవలం వినోదాన్నే కాకుండా, నాటి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై తన నటన ద్వారా ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చిన సంస్కర్త అని శ్లాఘించారు. సహజసిద్ధమైన నటనకు ఆద్యుడిగా నిలిచిన ఆయన జీవితం, ఆశయాలు నేటి యువ కళాకారులకు ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. నగరంలో కళలను, సాంస్కృతిక వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థకు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News