Breaking News

అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి

-ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ
-పురాణాల్లో రాక్షలు మాదిరిగా వ్యవహారిస్తున్న వైకాపా నాయకులు
-పశ్చిమ ఇంచార్జ్ బుద్దా వెంకన్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి రాష్ట్ర పురోగతిని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన 40 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం 43వ డివిజన్ ఊర్మిళ నగరలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన రాంబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వివరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పెన్షన్లు, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రజా సమస్యలపై వచ్చిన వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో 40 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, ప్రజల భద్రతకు చంద్రబాబు నాయుడు నాయకత్వమే భరోసా అని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తోందన్నారు. పురాణాల్లో రుషులు యాగాలు చేసేటప్పుడు రాక్షసులు దాన్ని పాడు చేసినట్టు ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రాన్ని పాడు చేద్దామనే ఒక తలంపుతో వైసిపి పార్టీ, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో పూజలు శ్రీనివాసు, మాదాల తిరుపతిరావు, తాటి శ్రీకాంత్, కాకర్ల కోటి, కూరాకుల రామచంద్రరెడ్డి, అలుగండ్ల సుబ్బారెడ్డి, పొదిలి ప్రసాద్, అచ్చిరెడ్డి, షాబుద్దీన్, మురి అప్పన్న, కోటేశ్వరావు, మల్లిబోయిన కొండ, డబ్బుకొట్టు ఏడుకొండలు, గుమ్మ బాలు, మారబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *