Breaking News

పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై అధ్యయనానికి హైపవర్డ్ కమిటీ

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో నియామకం
-నల్లమలలో అనుమానాస్పద స్థితిలో పులి మరణంపై పవన్ కళ్యాణ్ సీరియస్
-పులులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యలపై సమగ్ర నివేదికకు ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పులులే అడవులకు ప్రాణం… అడవులే ప్రకృతి సమతుల్యతకు ఆధారం. పులుల సంరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేశంలోనే అతిపెద్ద పులుల ఆవాసాలలో ఒకటైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR)లో పులుల సంరక్షణ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణకు మార్గదర్శకాలను రూపొందించేందుకు హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలోనే అతిపెద్ద పులుల ఆవాసాలలో ఒకటిగా గుర్తింపు పొందిన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో రెండు రోజుల క్రితం ఆడ పులి అనుమానాస్పద మృతి ఘటనను పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన, పులులు, వాటి ఆవాసాల సమర్థవంతమైన సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను గుర్తించారు. పులులతోపాటు వన్యప్రాణుల సంరక్షణ చర్యలు, హనుమాన్ కార్యకలాపాలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టేందుకు వీలుగా ఈ హైపవర్డ్ కమిటీకి సిఫారసు చేశారు.
రాష్ట్ర అటవీశాఖ సలహాదారు పి. మల్లికార్జునరావు, అడిషనల్ పీసీసీఎఫ్ రాహుల్ పాండే కమిటీలో శాఖాపరమైన సభ్యులుగా వ్యవహరించనున్నారు. అలాగే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) సభ్యుడు బి. రాజశేఖర్, హైదరాబాద్ కన్జర్వేషన్ ఫర్ టైగర్ సొసైటీ ప్రతినిధి ఇమ్రాన్ సిద్ధిఖీ, ప్రముఖ వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ ఎం. నవీన్ కుమార్ కమిటీలో సభ్యులుగా సేవలందించనున్నారు. హైపవర్డ్ కమిటీకి క్షేత్రస్థాయిలో సహకారం అందించడంతోపాటు సమన్వయ బాధ్యతలను విధుల్లో ఉన్న సీసీఎఫ్ అధికారి నిర్వహించనున్నారు.
పులుల జనాభా, ఆవాసాలకు ఎదురవుతున్న ముప్పులను గుర్తిస్తూ సమగ్ర అంచనా నివేదిక రూపొందించడం, నివారణకు తగిన వ్యూహాలకు రూపకల్పన చేయాలని హైపవర్డ్ కమిటీ సభ్యులకు  పవన్ కళ్యాణ్ దిశగా నిర్దేశం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత సంస్కరణలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై సమగ్రమైన సిఫారసులు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు, ఇతర భాగస్వామ్య వర్గాలతో సమావేశాలు నిర్వహించి, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను పరిశీలించి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. పులుల సంరక్షణ, అడవుల పరిరక్షణ, జీవవైవిధ్య రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. హైపవర్డ్ కమిటీ సిఫారసులు నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో తీసుకుంటున్న సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *