విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వించిపేట ప్రజలకు రైతుబజారుని అందుబాటులోకి తీసుకోని రావాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ, విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ రోజు గ్రీవెన్స్ డే సందర్భముగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పాతబస్తీ, వించిపేట ప్రాతంలోని ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు నాణ్యమైన తాజా కూరగాయలు అందించేందుకు 2017 లో అప్పటి నగరపాలక సంస్థ పాలక పక్షం వారు 40 లక్షల అంచనా వ్యయంతో జి+1 ప్రాతిపదికన మొదటి అంతస్థు e సేవ కేంద్రానికి, గ్రౌండ్ ఫ్లోర్ రైతు బజార్ కు నిర్మాణానికి శంకుస్థాపన చేసి తరువాత కాలంలో నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. మొదటి అంతస్థును గతంలోని వైసిపి ప్రభుత్వం సచివాలయాలకు కేటాయించి అందుబాటులోకి తీస్కొని వచ్చినప్పటికీ, రైతు బజార్ కి ఉద్దేశించిన గ్రౌడ్ ఫ్లోర్లో మాత్రం రైతు బజారు షాపులకు లబ్దిదారులను ఎంపిక చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ రైతు బజారులో షాపులు కేటాయింపులు జరుగక రైతుబజారు ప్రారంభం కాకపోవడం వల్ల ఈ ప్రాంగణం నిరుపయోగంగా మారి సాయంత్రం వేళ ఆసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిన పరిస్థితి కలెక్టర్ గారికి వివరించడం జరిగిందని దానిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిదని తెలియజేసారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి రైతు బజారు షాపులకు లబ్దిదారులను గుర్థించి వారికీ తక్షణమే షాపులను కేటాయించి రైతు బజారు ప్రారంభానికి అధికారులను చర్యలు చేపట్టాలని లేని పక్షంలో స్థానిక ప్రజలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిపిఐ పార్టీగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య, ఎఐవైఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు, స్థానిక డివిజన్ కార్యదర్సులు బోరా రామకృష్ణ, మోక దుర్గారావు, పైడి కత్తులు రాము తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News