విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్ (చిన్ని) జన్మదిన వేడుకలను సోమవారం టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ బీ సీ సెల్ అధ్యక్షుడు ముదిరాజ్ శివాజీ ఆధ్వర్యంలో భవానిపురంలో ఎంపీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో టీడీపీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జునరావు, టీడీపీ నేతలు అందే మేరీ, స్రవంతి, గజపతి, సతీష్, అనుదీప్, సీత చంద్ర శేఖర్, జస్వంత్, బిందు, మల్లేశ్వరి , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కోమలా విలాస్ సెంటర్ లో ఘనంగా ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) జన్మదిన వేడుకలు
టీడీపీ సీనియర్ నాయకులు మరుపిళ్ళ యల్లాజి , పిళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోమల విలాస్ సెంటర్ ,
పీ డి ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ టీడీపీ శ్రేణులతో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు స్థానిక మహిళలకు మూడు వందల చీరలు , విద్యార్థులకు రెండు వందల నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొణిజేటి రమేష్, దాడి మురళి కృష్ణ, పట్నాల హరిబాబు, బంకా నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News