విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’కు విశేష స్పందన లభిస్తోంది.
ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్, నాగోతి రామారావు,దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివాడ పట్నాయక్ , జనసేన 53 వ డివిజన్ అధ్యక్షులు పులిచేరి రమేష్,బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్, దేవిన హరి ప్రసాద్ , కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం, రేషన్ కార్డులు, స్థానిక సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు.
చాలా వరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, మిగిలిన వాటిని సంబంధిత శాఖల ద్వారా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజా దర్బార్ల ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కూటమి నేతలు తెలిపారు.
Prajavartha Online Telugu News