కేదారేశ్వరపేట రైతు బజార్ లో తక్కువ ధరకు బియ్యం కౌంటర్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేదారేశ్వరపేట, రైతు బజార్ లో తక్కువ ధరకు బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రత్యేక విక్రయ కౌంటర్ ను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌంటర్ లో చేపట్టిన ఏర్పాట్లు పరిశీలించి బియ్యం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందిస్తోందని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ ఆర్ ఐ శ్రీనివాస్, ఈ ఓ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *