-బ్రహ్మకుమారీస్ వారిచే 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు, దేశ యువత ఆరోగ్యంగా ఉండేందుకు ప్రధాని మోది పిలుపునిచ్చిన నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ను ఎన్డీయే కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, గాయత్రి పరివార్ శాఖ, బ్రహ్మకుమారీస్ సంస్థతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సింధూలత మాట్లాడుతూ యువతకు డ్రగ్స్ పీడ వదిలించే దిశగా వారిలో స్ఫూర్తి నింపేందుకు నషా ముక్త్ భారత్ అభియాన్ ఒక సమగ్ర ప్రచార కార్యక్రమంగా నిలుస్తోందన్నారు. ఆగస్టు 6 నుండి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బ్రహ్మకుమారిస్ వారందరూ కలిసి పదికోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమాన్ని తలపెట్టారు. దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ రూపొందించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞ చేసి ఆరోగ్యకరమైన విలువలతో కూడిన సమాజానికి నాంది పలకాలన్నారు. అనంతరం స్థానిక యువత , మరియు సుజనా మిత్రా కోఆర్డినేటర్లతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు..
ఈ కార్యక్రమంలో బీ కే వసుంధర, బీ కే మాలకొండయ్య , బీ కే రాజా,గాయత్రి పరివార్ వన్ టౌన్ శాఖ బాయన హేరంబ కుమార్, జోగి రాజ్ పురోహిత్, మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివాడ పట్నాయక్, జనసేన నాయకులు బొల్లేపల్లి కోటేశ్వరరావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News