అత్యంత వైభవంగా తాతా మనవడి జన్మదినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య పోరాట సమరయోధుడుగా,ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడుగా, వ్యవసాయ పశుపషక పారసేకరణ శాఖ మంత్రి గా, జై ఆంధ్ర ఉద్యమంలో కీలక నాయకుడుగా… ప్రజలచే “ఉక్కు కాకాని ” ప్రశంసలందుకున్న ఆ మహా నాయకుని జయంతి సందర్భంగా… అదే వారసత్వ పరంపర అందుకున్న మనవడి కాకాని తరుణ్ జన్మదినోత్సవం కూడా అది రోజు అవడం యాదృచ్ఛికము… మరియు ఆనందదాయకం… ఈరోజు ఠాగూర్ స్మారక గ్రంథాలయం విజయవాడ బందర్ రోడ్డు వద్ద ఘనంగా కాకాని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాతూరి నాగభూషణం  కాకాని సేవలను కొనియాడుతూ అలానే ఆ రోజుల్లో పాతూరి నాగభూ షణం నెలకొల్పిన బోటు గ్రంథాలయాన్ని గుర్తు చేశారు… ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, కాకాని సేవలను కొనియాడారు. తాతకు తగ్గ మనవడుగా సేవలందిస్తున్న తరుణ్  సేవలను అభినందించారు. ఈ సందర్భంగా గ్రంధాలయ పాఠకులకు కావలసిన కుర్చీలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయ అతిధిధులను కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని కే రమాదేవి మరియు గ్రంథాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు. కాకాని తరుణ్ జన్మదిన పురస్కరించుకొని అందరికీ మిఠాయిలు అందజేశారు. అలాగే రాబోయే కాలంలో గ్రంథాలయాలకి మరింత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తరుణ్ తెలియజేసారు. సేవలను వారసత్వం గా అందిపుచ్చుకున్న తరుణ్ కి ఠాగూర్ స్మారక గ్రంధాలయ అధికారిని రమాదేవి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *