Breaking News

ఓటు పోతుందని ఆందోళన చెందవద్దు – ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం

-అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
-ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావాలి – ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ
-ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియ అనంతరం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు నమోదు అవకాశం ఉంది
-జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన నేపథ్యంలో జాబితాలో పేరు లేకపోవడంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీశ తెలిపారు.

జూలై 31 నుంచి ఆగస్టు 30, 2026 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించే అవకాశం ఉన్నందున, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు నమోదు, సవరణలు చేసుకోవాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision – SIR) చేపట్టినట్లు తెలిపారు. 2002లో ఓటరుగా నమోదైన వారి ఓటును ప్రస్తుత ఓటుతో అనుసంధానం చేసే ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. ఈ ప్రక్రియలో జిల్లాలో మొత్తం 29,361 డబుల్ ఎంట్రీలను గుర్తించి ముసాయిదా జాబితా రూపొందించినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా, తప్పులులేకుండా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ముసాయిదా జాబితాలో పేరు లేకపోవడం, పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు అవసరమైతే ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO), తహశీల్దార్, సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO), ఎన్నికల నమోదు అధికారి (ERO) కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తమ చిరునామాలోనే నివసిస్తున్నప్పటికీ జాబితాలో పేరు లేకపోయిన వారు లేదా పొరపాటున మరణించిన వారిగా నమోదు చేయబడిన వారు ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. రెండు ప్రాంతాల్లో ఓటు నమోదై ఉన్నవారు తమకు కావాల్సిన నియోజకవర్గంలో ఓటును కొనసాగించేందుకు ఫారం-8 ద్వారా బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సవరణల ప్రక్రియలో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28, 2026 వరకు నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన, విచారణ, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అవసరమైన వివరాలు సమర్పించని వారు లేదా సమర్పించిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తామని, అలాంటి వారు నిర్ణీత గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించారు.

ఓటరు నమోదు లేదా వివరాల ధృవీకరణ కోసం క్రింది పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు.

* ప్రభుత్వం/పీఎస్‌యూ ఉద్యోగి లేదా పింఛనుదారుల ఐడీ / PPO
* 01-07-1987కు ముందు ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రం
* జనన ధ్రువీకరణ పత్రం
* పాస్‌పోర్ట్
* మెట్రిక్యులేషన్ లేదా విద్యా ధ్రువపత్రం
* శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం (PRC)
* అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం
* OBC / SC / ST కుల ధ్రువీకరణ పత్రం
* NRC (వర్తించే ప్రాంతాల్లో)
* కుటుంబ రిజిస్టర్
* ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇంటి కేటాయింపు ధ్రువీకరణ పత్రం

అన్ని క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం అనంతరం 2026 అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ అని పేర్కొంటూ, 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఫారం-6తో పాటు Annexure-D సమర్పించి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైన సవరణలు గడువులోపు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *