విజయవాడ నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో అవార్డు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లో విజయవాడ నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో మూడవ ఉత్తమ పరిశుభ్ర నగరంగా, చెత్త రహిత నగరంగా 5 స్టార్‌ రేటింగ్, వాటర్ ప్లస్ సిటీ, PrerakDauur Samman Award – Gold (Anupam) లను సాదించి రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్  చేతుల మీదుగా అవార్డు స్వీకరించుట జరిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని గురువారం రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది  శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఐ.ఏ.ఎస్, కమిషనర్ మరియు సంచాలకులు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ యం.యం నాయక్ ఐ.ఏ.ఎస్ లతో కలసి విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మినగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ఐ.ఏ.ఎస్, మర్యాద పుర్వకంగా ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్ మోహనరెడ్డి ని మరియు మునిసిపల్ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ ని కలసి అవార్డు లను సాధించుటకు ఆయా రంగములలో నగరపాలక సంస్థ చేపట్టిన సంస్కరణలకు అందించిన సహకారములకు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *