-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాధించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బందర్ రోడ్డులోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియాన్ని సందర్శించి వివిధ సౌకర్యాలను పరిశీలించారు. స్టేడియంలోని జిమ్, ఇండోర్ క్రీడా విభాగాలు, బ్యాడ్మింటన్ కోర్టులు, స్కేటింగ్ రింక్, వాష్‌రూమ్‌లు తదితర సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్టేడియానికి వచ్చే క్రీడాకారులు, యువతకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిమ్‌లోని పరికరాలను ఎప్పటికప్పుడు నిర్వహణలో ఉంచి వినియోగానికి అనువుగా ఉండేలా చూడాలని సూచించారు. బ్యాడ్మింటన్ కోర్టులు, స్కేటింగ్ రింక్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించాలని, వాష్‌రూమ్‌లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
స్టేడియం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, క్రీడాకారులు మరియు సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ సూచించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ పి సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) కె. దుష్యంత్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ.శ్రీధర్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు, ఎస్ ఎఫ్ ఓ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News