Breaking News

అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో ద్విస్వర్ణ పతకాల విజేత ఉప్పాల కోటేశ్వరరావును అభినందించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన ఛాంబర్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఉప్పాల కోటేశ్వరరావును ఘనంగా అభినందించారు.

కృష్ణలంకలోని పద్మావతి ఘాట్ వద్ద గల సచివాలయం లో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఉప్పాల కోటేశ్వరరావు ఆగస్టు 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లోని లక్ష్మీ గార్డెన్స్, చంపాపేటలో నిర్వహించిన 2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్లో పాల్గొన్నారు.

ఆగస్టు 2న జరిగిన పోటీల్లో కాటా (Kata) విభాగంలో స్వర్ణ పతకం, కుమిటే (Kumite) విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, మొత్తం ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌షిప్ కప్ ను సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర మాట్లాడుతూ, విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ విశేష ప్రతిభ కనబరచడం అభినందనీయమని అన్నారు. అంతర్జాతీయ వేదికపై విజయవాడ నగరపాలక సంస్థకు గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *