మండలి వెంకటకృష్ణారావు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మండలి వెంకటకృష్ణారావు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మాజీ మంత్రి, ప్రముఖ ప్రజానాయకుడు, తెలుగు భాషా–సంస్కృతి పరిరక్షకుడు మండలి వెంకటకృష్ణారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మండలి వెంకటకృష్ణారావు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం పనిచేసిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. విద్యా వికాసం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, తెలుగు భాషా మరియు సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పరిపాలనలో విలువలు, ప్రజల పట్ల అంకితభావం, నిస్వార్థ సేవ ఆయన జీవితానికి ప్రతీకలని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *