Breaking News

జీజీహెచ్ అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

-గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
-జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు అభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.

జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్ వ్యవస్థ, మానవ వనరుల నిర్వహణ, రోగుల సౌకర్యాల కల్పన తదితర అంశాలపై మంగళవారం జిజిహెచ్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు.

ఆసుపత్రి ఆవరణలో రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది భద్రతను మరింత పటిష్టం చేసేందుకు పోలీసు శాఖ ద్వారా ఒక మహిళా కానిస్టేబుల్, ఒక పురుష కానిస్టేబుల్‌ను విధుల్లో నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వెంటనే స్పందిస్తూ అవసరమైన సిబ్బందిని కేటాయించేందుకు అంగీకారం తెలిపారు.

ప్రస్తుతం జీజీహెచ్‌లో సుమారు 81 ఖాళీ పోస్టులు ఉన్న నేపథ్యంలో వాటి భర్తీపై సమగ్రంగా చర్చించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2025 అమల్లో ఉన్నందున రెగ్యులర్ నియామకాలపై పరిమితులు ఉన్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. నిబంధనలకు అనుగుణంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయగల పోస్టులను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని కమిటీ నిర్ణయించింది.

రోగుల సౌకర్యార్థం ఆసుపత్రిలో లిఫ్ట్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు సమావేశంలో వివరించారు. వాటికి త్వరితగతిన పరిపాలనా అనుమతులు లభించేలా చర్యలు తీసుకొని, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా కృషి చేయాలని నిర్ణయించారు.

ఆసుపత్రి క్యాంటీన్ నిర్వహణపై సమీక్ష నిర్వహించి, ప్రస్తుతం ఉన్న ఒప్పందం గడువు ముగిసిన వెంటనే నిబంధనల ప్రకారం కొత్త టెండర్లు ఆహ్వానించి పారదర్శకంగా నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని తీర్మానించారు.

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు అంశంపై ట్రాన్స్‌కో అధికారులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. హెచ్‌టీ లైన్ ఉన్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను ఆసుపత్రి యాజమాన్యమే చేపట్టాల్సి ఉంటుందని తెలియజేయడంతో, ఏపీఎంఐడీసీ ద్వారా సాంకేతిక అంచనాలు సిద్ధం చేసి తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ వార్డులలోని కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేసేందుకు సమర్పించిన అంచనాలను పరిశీలించిన కమిటీ, సవరించిన అంచనాలను సమర్పించిన అనంతరం వాటికి పరిపాలనా ఆమోదం ఇవ్వాలని నిర్ణయించింది.

ఆసుపత్రిలో మరుగుదొడ్లు, వాష్‌రూములు, శానిటరీ సదుపాయాల నిర్వహణపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం అనేక మరుగుదొడ్లు, వాష్‌రూములు మరమ్మతులకు అవసరమైన స్థితిలో ఉన్నందున వాటిని అత్యవసరంగా పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అవసరమైన నిధులతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రి ఆవరణలో ఔషధ మొక్కలు, ఇతర హరితవనాన్ని అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను వినియోగించే అవకాశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా వెంటనే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం నామినేషన్ విధానంలో ఏజెన్సీని ఎంపిక చేసి అత్యవసరంగా పనులు పూర్తి చేయాలని కమిటీ ఆమోదించింది.

మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా నివాళులు

మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా మంగళవారం జి జి హెచ్ లో జరిగిన సమీక్ష సమావేశానికి ముందుగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండలి వెంకటకృష్ణారావు ప్రజాసేవలు, సమాజానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి లీల ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డాక్టర్ జి భానుమూర్తి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ దయాకర్, ఎన్టీఆర్ వైద్య సేవ డి సి ఓ డాక్టర్ సతీష్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బోయిన వెంకట కృష్ణమరాజు, లింగం విజయ్, ఎండి బాషి, ఇతర వైద్యులు, పరిపాలన విభాగం అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *