ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి (చంటి) కూటమి నేతలు పీ వీ చిన సుబ్బయ్య, నాగోతి రామారావు, బొమ్ము రాంబాబు, తారిఖ్ అజీజ్, దుర్గా ప్రసాద్, బెన్నా భక్తుల సోమేశ్వరరావు , ఏలూరి సాయి శరత్, కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం, రేషన్ కార్డులు, గురించి ప్రజలు వినతులు అందజేశారు. చాలా వరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, మిగిలిన వాటిని సంబంధిత శాఖల ద్వారా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజా దర్బార్ల ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని 54 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తారిక్ అజీజ్, జనసేన పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *