షేక్ బాజీ సాహెబ్ ఉర్దూ ప్రైమరీ పాఠశాల అభివృద్ధికి చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాధరపురంలోని, షేక్ బాజీ సాహెబ్ మున్సిపల్ ఉర్దూ ప్రైమరీ పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. మంగళవారం కూటమి నేతలతో కలిసి పాఠశాలను పరిశీలించారు. తమ బడిలో ప్రధాన సమస్యలైన తాగునీరు, విద్యుత్ లైన్ల రిపేర్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రధానోపాధ్యాయురాలు సయ్యద్ తాహెరా జమీల్ ప్రత్తిపాటి శ్రీధర్ కు తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పాఠశాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని త్వరలో అంచనా రూపొందించి పాఠశాల అభివృద్ధి కోసం చేయవలసిన ప్రధాన పనులను ప్రారంభిస్తారని అన్నారు. కూటమి నేతలు ఏలూరి సాయి శరత్, బొల్లేపల్లి కోటేశ్వరరావు సుజనా మిత్రా కోఆర్డినేటర్ నర్మద పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *