Breaking News

దేశం కోసమే మధ్యవర్తిత్వం…

-కృష్ణా జిల్లా జడ్జి గుట్టల గోపి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి వారి సంయుక్త పిలుపుమేరకు “మీడియేషన్ ఫర్ నేషన్ 3.O” అనే నినాదంతో బుధవారం కృష్ణా జిల్లా జడ్జి గుట్టల గోపి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయశాఖ సిబ్బంది కక్షిదారులు పోలీస్ సిబ్బంది కృష్ణాజిల్లా కోర్టు నుండి సాయిబాబా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సాయిబాబా గుడి వద్ద మానవహారం నిర్మించారు..

ఈ సందర్భంగా కృష్ణాజిల్లా జడ్జి జి .గోపి మాట్లాడుతూ దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కేసుల పరిష్కారం కోసం ఈ సంవత్సరం ఇప్పటికే రెండుసార్లు నిర్వహించిన మీడియేషన్ ఫర్ నేషన్ కార్యక్రమం విజయవంతమై కొన్ని వేల కేసులు పరిష్కారం అయినట్లు ఆయన తెలియజేశారు. పెండింగ్ లో ఉన్న కేసులు గాని రాజీపడదగ్గ కేసులలో మీడియేషన్ సెంటర్ ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవడం ఉత్తమమైన మార్గమని తెలియజేశారు. మీడియేషన్ ద్వారా కేసులు పరిష్కారం చేసుకుంటే ఉభయ వర్గాలు గెలిచినట్లేనని ఎటువంటి భవిష్యత్తు వివాదాలకు తావుండదని జిల్లా జడ్జి తెలియజేశారు. కృష్ణా జిల్లాలో 99 మంది ప్రత్యేక శిక్షణ పొందిన మీడియేటర్స్ ద్వారా కొన్ని వందల కేసులు పరిష్కారం జరుగుతున్నట్లు ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో కేసుల సత్వర పరిష్కారం కోసం మీడియేషన్ సెంటర్ ను ఉపయోగించుకోవటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం న్యాయ సేవా సదన్ లో మీడియేషన్ సెంటర్ నిరంతరం పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. ఇందులోని సేవలు అన్ని ఉచితమని తెలియజేశారు. మీడియేషన్ ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవడం ద్వారా ప్రజలకు సమయం డబ్బు ఆదా అవుతుందని తెలియజేశారు. రాజీమార్గమే రాజీమార్గం అనే నినాదంతో న్యాయవ్యవస్థ ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. ఈ ర్యాలీలో మీడియేషన్ ప్రక్రియను ప్రోత్సహించే నినాదాలతో ప్లే బోర్డులు ప్రదర్శించారు.

అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలోని మీడియేషన్ అవేర్నెస్ సెంటర్ ను జిల్లా జడ్జి గోపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు జి. వెంకటేశ్వర్లు సిహెచ్. దుర్గా పూర్ణిమ, టి. రాజా వెంకట్రాది,అదనపు సీనియర్ సివిల్ జడ్జి
సిహెచ్. యుగంధర్ జూనియర్ సివిల్ జడ్జీలు ఎండి రహంతుల్లా, పి. సాయి సుధా, జె.బి. టి. ఎస్.దేవి, కృష్ణా జిల్లా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఓ.వి. నాగేశ్వరరావు మరియు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్ .వరలక్ష్మి మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తుంగల హరిబాబు మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాజి ప్రభుత్వ న్యాయవాది అజామాతునిస్స బేగం న్యాయవాదులు ముసలయ్య, జి. రమాదేవి, జి. శ్రీనివాస్ లంకిశెట్టి సాయి ఫణి సంతోష్,మద్దాల సువర్ణ రాజు,పద్మావతి గంజి నాగేంద్రం పారా లీగల్ వాలంటీర్లు, న్యాయసే వాధికారి సంస్థ సిబ్బంది, న్యాయశాఖ సిబ్బంది పోలీసు అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *