Breaking News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. బుధవారం కోడూరు మండలం మందపాకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానం, మౌలిక సదుపాయాలు, మందుల లభ్యత, ప్రసూతి సేవలు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని వైద్య సేవలను సకాలంలో అందించాలని సంబంధిత వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేసి వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో ఇటీవల చేరి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన పలువురు రోగులకు స్వయంగా ఫోన్ చేసి, వారికి అందిన వైద్య సేవలు, వైద్య సిబ్బంది స్పందన, మందుల లభ్యత, ఆసుపత్రిలో కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకొని సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *