Breaking News

జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి

-జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ అత్యంత ప్రామాణికమైన పత్రము
-గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం – ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి
-జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు భాగస్వాములు కావాలి
-క్షేత్రస్థాయిలో నాణ్యమైన సమాచార సేకరణతోనే ఖచ్చితమైన గణాంకాలు సాధ్యం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ అత్యంత ప్రామాణికమైన పత్రమని, గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతోనే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు సమర్థవంతంగా రూపొందించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు.

స్థానిక కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో బుధవారం జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ నమోదుపై జిల్లాలోని స్టాటిస్టికల్ అధికారులకు నిర్వహించిన ఒకరోజు కార్యశాలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు ప్రామాణిక ఆధార పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన సమాచార సేకరణ, నమోదు ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి వివరాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించిన అనంతరమే నమోదు చేయాలని ఆదేశించారు. జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్న కలెక్టర్, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారీగా సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణతో పాటు అవసరమైన ఫారాలు, మార్గదర్శకాలను ముందుగానే అందుబాటులో ఉంచి, వారి సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని తెలిపారు. శిక్షణ ఇచ్చినంత మాత్రాన సరిపోదని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, ఫాలోఅప్, ధృవీకరణ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది సేకరించిన సమాచారాన్ని సంబంధిత శాఖల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించి, ఖచ్చితమైన గణాంకాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియలో అవసరమైన సమాచారాన్ని అన్ని సంబంధిత శాఖల నుంచి సమన్వయంతో సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి శిక్షణ కార్యక్రమానికి ముందు మండల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందిలో బాధ్యత పెరిగి, నాణ్యమైన సమాచారం అందుతుందని తెలిపారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఖచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారంతో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ను అత్యంత ప్రామాణిక పత్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

ఈ శిక్షణ కార్యక్రమానికి సహాయ స్టాటిస్టికల్ అధికారి మేక స్వాతి మాస్టర్ ట్రైనర్ గా వ్యవహరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *