Breaking News

నూతన ప్రైవేట్ ఐటీఐల ఏర్పాటు మరియు అదనపు ట్రేడ్లు/యూనిట్ల మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం…

-ఉపాధి మరియు శిక్షణా శాఖ సంచాలకులు జి. గణేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనముగా ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థల (Private ITIs) ఏర్పాటు మరియు ఇప్పటికే ఏర్పాటు చేయబడిన పారిశ్రామిక శిక్షణా సంస్థలలో అదనపు ట్రేడ్లు / యూనిట్లు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి మరియు శిక్షణా శాఖ (డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్) సంచాలకులు జి. గణేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
2027-28 సంవత్సరానికి గాను డైరెక్టరేట్ జనరల్ (www.dgt.gov.in) వారిచే జారీ చేయబడిన నిబంధనలను అనుసరించి అర్హులైన సంస్థల నుండి దరఖాస్తులు కోరుచున్నామన్నారు. సొసైటీల రిజిస్టర్డ్ యాక్ట్ ప్రకారం నమోదు చేయబడిన రిజిస్టర్డ్ సొసైటీలు, రిజిస్టర్డ్ ట్రస్టులు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మరియు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్‌లు (LLPs) ఈ దరఖాస్తులను సమర్పించేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన సంస్థలు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 30వ (30.09.2026) తేదీ లోగా అందజేయాలని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇతర వివరాలను విజయవాడలోని నైపుణ్య, ఉపాధి మరియు శిక్షణా శాఖ సంచాలకులను సంప్రదించగలరని నైపుణ్య, ఉపాధి మరియు శిక్షణా శాఖ సంచాలకులు జి. గణేష్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *