విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశ ప్రతిష్టను, తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన అజయ్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. గురువారం ఇందిరాగాంధీ స్టేడియం శాప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, మాట్లాడుతూ ఆయన సాధించిన ఈ విజయం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడింది. కఠోర శ్రమ అరుదైన వారసత్వం అజయ్ బాబు సాధించిన
ఈ పతకం కేవలం ఒక రోజులో వచ్చింది కాదని, ఆయన కఠోర శ్రమ మరియు వారి తండ్రి అందించిన ప్రోత్సాహం దీని వెనుక ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. విశేషమేమిటంటే, అజయ్ బాబు తండ్రి కూడా గతంలో కామన్వెల్త్ క్రీడల్లో పతకాన్ని సాధించి ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి రెండు తరాలు ఈ స్థాయిలో పతకాలు సాధించడం అత్యంత అరుదైన విషయమని, ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని ప్రభుత్వం అభినందించింది.
క్రీడాకారులకు పెద్దన్న లా ప్రభుత్వం
పతకాలు సాధించిన తర్వాతే కాకుండా పోటీలకు వెళ్లకముందే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే ఈ ప్రభుత్వ విధానమని స్పష్టం చేసింది. దీనిలో భాగంగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గతంలోనే కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ క్రీడాకారులతో భేటీ అయ్యి, వారితో కలిసి భోజనం చేసి, అవసరమైన ఆర్థిక సహాయాన్ని (ప్రేపరషన్ అమౌంట్ ) కూడా విడుదల చేశారు. ఈ సహాయాన్ని కేవలం నగదుగా కాకుండా, ప్రభుత్వం క్రీడాకారులకు ఇచ్చే ఒక భరోసాగా, ‘పెద్దన్న’ పాత్రగా భావిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లక్ష్యం ఒలింపిక్ పతకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అజయ్ బాబుకు ప్రతి అడుగులోనూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. అజయ్ బాబు భవిష్యత్తులో ఏషియన్ గేమ్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో కూడా పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచాలని ఆకాంక్షించింది. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అజయ్ బాబుతో నేరుగా ముచ్చటించి, ఆయనను అభినందించే కార్యక్రమం కూడా జరుగుతోందని, చైర్మన్ రవి నాయుడు అన్నారు.
Prajavartha Online Telugu News