– మంత్రి కొండపల్లి శ్రీనివాస్
– సచివాలయంలో బ్యాంకర్లు, ఎంఎస్ఎంఈ అసోసియేషన్ల సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంఎస్ఎంఈలకు రుణ ప్రక్రియ సులభతరం చేయాలని బ్యాంకర్లకు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గురువారం మంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, ఎంఎస్ఎంఈ అసోసియేషన్లతో సెక్రటేరియట్‌లోని 5వ బ్లాక్‌లోని కాన్పరెన్స్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వారికి రుణ ప్రక్రియ సులభతరం చేయాలన్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బ్యాంకు అధికారులతో చర్చించి ఎస్ఎల్‌బీఎస్‌లో చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి అనుగుణంగానే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఎంఎస్ఈ సీడీపీ, పీఎంఈజీపీ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఏపీ క్లస్టర్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ఏపీ చీఫ్ మినిస్టర్ ఎంటర్ ప్రెన్యూర్ ప్రోగ్రామ్ అమలు చేసేందుకు వివిధ బ్యాంకర్ల సహాయ సహకారాలు కోరుతున్నామని మంత్రి తెలిపారు. రుణాలను సీజీటీఎంఎస్ఈ ( క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ ) లో కవర్ చేయడంలో మన రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో ఉందని.. దీనిని గౌరవ ముఖ్యమంత్రి కోరిక మేరకు మొదటి స్థానంలోకి తీసుకువచ్చేందుకు బ్యాంకర్లు సహకారం అందించాలని మంత్రి కోరారు. ఎంఎస్ఎంఈ అధారిత అసోసియేషన్ల సందేహాలను బ్యాంకర్లు నివృత్తి చేసి.. బ్యాంకు ద్వారా లభ్యమయ్యే సదుపాయాలు వారికి వివరించారు. ఎంఎస్ఎంఈ ఔత్సాహికులకు రుణం దరఖాస్తు కోసం ప్రభుత్వం యూనీఫైడ్ పోర్టల్ తయారు చేసి వాళ్లకు అందుబాటులోకి తీసుకురావాలని ఇండస్ట్రీస్ సెక్రటరీకి మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ శ్రీథర్‌బాబు, ఇండస్ట్రీస్ సెక్రటరీ డాక్టర్ ఎన్. యువరాజ్, ఎంఎస్ఎంఈ డవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వమనోహరన్, ఏపీ ఎంఎస్ఎంఈ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ సుధాకర్, ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ విజయరత్నంతో పాటు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు, క్రెడాయ్ జీఎస్ మోహన్‌రావు, ఫుడ్ ప్రాసెసింగ్ సాంబశివరావు, రాజశేఖర్, కోవై రాధిక, ఏపీ టెక్స్‌టైల్స్ మిల్స్ అసోసియేషన్ సెక్రటరీ యూఎం. కుమార్, వివిధ రాష్ట్ర స్థాయి బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News