విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2026-27 సంవత్సరమునకు గాను బి.ఇ., బీటెక్, ఎం.బి.బి.ఎస్., బి.డి.ఎస్., బి.ఎడ్., బి.బి.ఎ., బి.ఫార్మసి, ఎల్.ఎల్.బి., ఎం.బి.ఎ., ఎమ్.సి.ఎ., బి.ఎస్.సి.(నర్సింగ్) మొదలగు వృత్తి విద్యా కోర్సులలో మొదటి సంవత్సరము చదువుతున్న మాజీ సైనికుల పిల్లలకు ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకము క్రింద ఉపకార వేతనము పొందుటకు కేంద్రీయ సైనిక్ బోర్డు, న్యూ డిల్లీ వారు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వృత్తి విద్యా కోర్సులలో చేరుటకు గల అర్హత పరీక్షలో కనీసము 60 శాతము మార్కులు పొంది ఉండవలెను. ఈ పధకము క్రింద విద్యార్దికి సంవత్సరానికి రూ. 30,000/- లు చొప్పున, విద్యార్దినికి రూ. 36,000/- లు చొప్పున ఉపకార వేతనము మంజూరు చేసెదరు.
కావున, పై అర్హతలు కలిగిన వారందరు నిర్దేశిత దరఖాస్తు ఫారములను www.ksb.gov.in ద్వారా చివరి తేది : 31-12-2026 లోపుగా Annexure – I, II & III లను పూర్తిచేసి ఆన్ లైన్ ద్వారా పూర్తిచేసిన ధరఖాస్తు ఫారమలను మరియు సంబంధిత దృవపత్రములను జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయమునకు అందజేయవలసినదిగా శ్రీ వై. ఈశ్వర రావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి (పూ.అ. భా), విజయవాడ వారు తెలియజేసినారు. ఇతర వివరములు కొరకు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము, విజయవాడ వారిని కార్యాలయము పనివేలలో నేరుగా గాని ఫోన్ నెంబర్ 0866 – 2473330 / 86888 17829 సంప్రదించగలరు.
Prajavartha Online Telugu News