విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, రేపటి (ది 07/08/2026) నుండి జిల్లా వ్యాప్తంగా RSK ల వారిగా RSK ఇంచార్జి టీమ్ లీడర్ గా వ్యవసాయ అనుబంధ శాఖల గ్రామ సహాయకులు, గ్రామ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ సాగు నీటి అధ్యక్షులు మరియు మెంబెర్స్ , గ్రామ ఆదర్శ రైతులతో బృందాలుగా ఆ RSK పరిధి లో గల ప్రతి రైతును కలుస్తారు అని జిల్లా వ్యవసాయ అధికారి Ch.తిరుమల దేవి తెలియ చేశారు.
ఈ బృందాలు రైతులను కలిసి వారి వేసిన పంటలు ఈ El nino వేడి ప్రభావము వల్ల దెబ్బతినకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతి అయిన ద్రవ జీవామృతం పిచికారి చేయించుట, ప్రత్తి , మిర్చి పంటలలో 6 రకాల అంతర పంటలు గ్యారంటీ ఆదాయము కొరకు వేయించుట, అసలు పంటలు వేయని పొలాలలో ప్రకృతి వ్యవసాయ విధానమైన PMDS విత్తనాలు (20 నుండి 30 రకాల పంటల విత్తనాలు 12 kg లు ఒక కిట్ గా ) విత్తన గుళికల గా చేయించి రైతులు వేసుకొనెలాగ చేసి కనీస ఆదాయము పొందేలాగా అవగాహన కల్పించటం. మామిడి తోటల్లో ఈ PMDS విత్తనాలను వేసి 40 రోజుల తరువాత పశుగ్రాసముగా వాడు కొనుటకు, అదేవిధముగా ఖాళీగా ఉన్న భూములలో ఈ PMDS విత్తనాలు పశుగ్రాసం కొరకు వేయించటము ఈ బృందాలు చేస్తాయి అని తెలిపారు.
ఐతే ఈ PMDS విత్తనాలు విత్తనాల షాపుల్లో లభ్యమవ్వవు.
ఇవి ప్రత్యేకముగా ప్రకృతి వ్యవసాయ గ్రామాలలో నెలకొల్పిన ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రములో( BRC) మాత్రమే లభ్యమవుతాయి అని ప్రస్తుతము మన జిల్లాలో 37 BRC లు ఉన్నాయని వాటిలో 900 క్వింటాలు PMDS విత్తనాలు అనగా సుమారు 7000 కిట్లు అందించే సామర్థ్యము ఆ BRC లకు ఉన్నది అని APCNF జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ జి.శ్రీనివాసరావు తెలియ చేశారు.
ఇంకా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, BRC కేంద్రాలలో జిగురు అట్టలు (Sticky Traps), లింగాకర్ష బుట్టలు (Pheromone Traps) పురుగులు, తెగుళ్ల నివారణకు కషాయాలు, బలానికి స్ప్రే చేసే టానిక్స్ వంటి అన్ని ప్రకృతి వ్యవసాయ వనరులు అందుబాటులో ఉంచబడినవి అని తెలిపి ఈ BRC వివరాలకు గ్రామ వ్యవసాయ సహాయకులు లనుగాని గ్రామ ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని గాని సంప్రదించాలని శ్రీనివాస రావు తెలియచేసారు.
Prajavartha Online Telugu News