విజ‌య‌వాడ జీజీహెచ్‌లో ఉచితంగా గుండె ఆప‌రేష‌న్ లు చేస్తాం

-డాక్ట‌ర్ ర‌మేష్ హాస్పిట‌ల్స్ యాజ‌మాన్యం వెల్ల‌డి
-మంత్రిస‌త్య‌కుమార్ యాద‌వ్‌కు సంసిద్ధ‌త లేఖ‌ అంద‌జేత‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ జీజీహెచ్‌లో ఉచితంగా బైపాస్ స‌ర్జ‌రీలు చేసేందుకు డాక్ట‌ర్ ర‌మేష్ హాస్పిట‌ల్స్ యాజ‌మాన్యం ముందుకొచ్చింది. త‌మ సంస్థ 38వ వార్షికోత్స‌వ వేడుక‌ల్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ జీజీహెచ్ కు వ‌చ్చే పేదల్లో అవ‌స‌ర‌మైన వారికి తొలి ద‌శ‌లో నెల‌కు క‌నీసం 5 చొప్పున గుండెకు సంబంధించిన‌ బైపాస్ స‌ర్జ‌రీల‌ను చేస్తామ‌ని డాక్ట‌ర్ ర‌మేష్ హాస్పిట‌ల్స్ యాజ‌మాన్యం ముఖ్య ప్ర‌తినిధులు డాక్ట‌ర్ సుద‌ర్శ‌న్‌, రాజ‌శేఖ‌ర్ వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు విజ‌య‌వాడ‌లో సంసిద్ధ‌త లేఖ‌ను గురువారం అంద‌జేశారు. శ‌స్త్ర చికిత్స‌ల అనంత‌ర వైద్యాన్ని’ టెలీ ఐసియు ‘విధానంలో అందిస్తామ‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ర‌మేష్ హాస్పిట‌ల్స్ యాజ‌మాన్య చొర‌వ‌ను మంత్రి ఆహ్వానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *