-మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాల్టీలోని డంపింగ్ యార్డ్ లో లెగసీ వేస్ట్ ని తొలగించే ఏజన్సీ నిర్లక్ష్య వైఖరిపై స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ లో లెగసీ వేస్ట్ త్వరితగతిన తొలగించకపోవడం వల్ల, పట్టణంలో రోజువారీ వచ్చే చెత్తని డంప్ చేయడం మున్సిపాల్టీకి పెద్ద సమస్యగా మారింది. విషయం తెలుసుకున్న చైర్మన్ పట్టాభిరామ్ మంగళవారం గుడివాడ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, ఇతర అధికారులతో మాట్లాడి, లెగసీ వేస్ట్ ని తొలగించడంలో ఏజన్సీవారి జాప్యం వల్ల సమస్య తలెత్తినట్లు తెలుసుకున్నారు. ప్రతి రోజూ వచ్చే చెత్తని తరలించే విషయంలో మున్సిపాల్టీవారు ఇబ్బందులుపడుతుంటే, ఏజన్సీ వారు లెగసీ వేస్ట్ ని తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లెగసీవేస్ట్ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏజన్సీవారిని ఆదేశించారు. లెగసీ వేస్ట్ ని వెంటనే తొలగించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కూడా చైర్మన్ పట్టాభిరామ్ హెచ్చరించారు.
Prajavartha Online Telugu News