విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొలగాని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రవాస ఆంధ్రుడు గొలగాని రవికృష్ణ, అమ్మమ్మ తాతయ్య అయిన కీ॥శే॥ డొప్పా తాతయ్య & పైడమ్మ జ్ఞాపకార్థం కొత్తపేట నెహ్రు బొమ్మసెంటర్ లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానమునకు స్వామి వారి పూజ కొరకు వెండి ఏక హారతి Ê భక్తుల సౌకర్యార్థం 50 కుర్చీలను మా గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. ఆదివారం గొలగాని చారిటబుల్ ట్రస్ట్ తరుపున వారి కుటుంబ సభ్యులు బొట్టా నాగమణి, బొట్టా నాగార్జున కుమార్, వేమూరి కృష్ణ పరమాత్మ, పద్మావతి దంపతులు, కొండ్ర ఉమాదేవి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు కార్యదర్శి బూర కనకారావు, మురపాల దుర్గారావులను కలసి స్వామి సన్నిధికి 139 గ్రాముల రూ.37,500 విలువ గల వెండి హారతి,12,500 రూపాయల 50 ప్లాస్టిక్ కుర్చీలను బహుకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షులు, కార్యదర్శి బూర కనకారావు, మురపాల దుర్గారావు మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిర పడినా పుట్టిన ఊరు పై వున్న మమకారంతో సమాజ సేవతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కోసం లక్షలాది రూపాయలను విరాళల రూపంలో అందజేయడం హర్షణీయమని కొనియాడారు. గొలగాని రవికృష్ణ వారి తల్లి దండ్రులు దుర్గమ్మ, రామారావు పేరిట పలు దఫాలుగా శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానం అభివృద్ధి నిమిత్తం లక్షలాది రూపాయలు విరాళంగా అందజేశారని గుర్తు చేశారు. ఇక దేవాలయ బోర్డు మెంబర్ నమ్మి భాను ప్రకాష్ యాదవ్, యాదవ సంఘం పెద్దలు నమ్మి అప్పారావు యాదవ్ మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ సేవా భావంతో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అగ్నిహోత్రం సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News