అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద తమ భూములను పెనుమాకకు చెందిన 8 మంది రైతులు స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకొచ్చారు. పెనుమాక గ్రామ పరిధిలోని 7.10 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారికి రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో బుధవారం, 2026 ఆగస్టు 19న 8 మంది రైతులు అందజేశారు. కార్యక్రమంలో పెనుమాక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.సుధారాణి పాల్గొన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పెనుమాక రైతులు ఈ సందర్భంగా తెలియజేశారు. రాజధాని గ్రామాల ప్రజలు పూలింగ్ ప్రక్రియకు APCRDA అధికారులతో సహకరించాలని వారు కోరారు. ఈ రోజు పూలింగ్ కింద సమీకరించిన మొత్తం 7.10 ఎకరాల భూమిలో రాజధాని రైతుల కొరకు అభివృద్ధి చేస్తున్న LPS జోన్లు(0.54 ఎకరాలు), ట్రంక్ రహదారులు(3.07 ఎకరాలు), వరద నిర్వహణ ప్రాజెక్టుల(2.12 ఎకరాలు) పరిధిలో ఉండటంతో..ఆయా పనులలో పురోగతి జరగనుంది.
పూలింగ్ కింద భూములు ఇచ్చిన పెనుమాక గ్రామ రైతుల వివరాలు:
1 కమతం రాంబాబు 0.30 ఎకరాలు
2 సింగంశెట్టి రాంబాబు 0.30 ఎకరాలు
3 రేపల్లె నాగేశ్వరరావు 0.85 ఎకరాలు
4 ఆరుమళ్ల లోకేష్ రెడ్డి 0.28 ఎకరాలు
5 ఆరుమళ్ల ఉమామహేశ్వరరెడ్డి 0.28 ఎకరాలు
6 కల్లం శకుంతలా దేవి 4.10 ఎకరాలు
7 మేకా శివశంకర్ రెడ్డి 0.52 ఎకరాలు
8 మేకా శ్రీనివాసరెడ్డి 0.47 ఎకరాలు
మొత్తం 7.10 ఎకరాలు
Prajavartha Online Telugu News