Breaking News

13, 14వ డివిజన్లలో దేవినేని అవినాష్ పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13, 14వ డివిజన్లలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దేవినేని అవినాష్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాల కారణంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని దేవినేని అవినాష్ తెలిపారు.అనంతరం1 3వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన తేటకూరి దుర్గ కుటుంబ సభ్యులను దేవినేని అవినాష్ పరామర్శించి, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అలాగే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న కోరే నారాయణరావును,మేజర్ ఆపరేషన్ చేయించుకున్న పల్లి కల్పనను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఇటీవల మృతి చెందిన పల్లి కుమార్ తండ్రి పల్లి ప్రకాశరావు కుటుంబ సభ్యులను, అలాగే ఇటీవల మృతి చెందిన చిన్నపరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి తండ్రి ఎలమంద రెడ్డి కుటుంబ సభ్యులను దేవినేని అవినాష్ పరామర్శించి, తన సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ అధ్యక్షులు మాగంటి నవీన్,మాజీ కార్పొరేటర్ చింతల సాంబయ్య, మండల అధ్యక్షులు సన్నీ,గద్దె కళ్యాణ్,అనుబంధ విభాగం అధ్యక్షులుశెటికం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు సుబ్బరాజు, కోలా ఉమ,పిడుగు విజయ్,సుభాని,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *