Breaking News

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం : బుద్ధా వెంకన్న

-నూతనంగా ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన వర్ల రామయ్య కి శాలువాతో సత్కరించి గజమాలవేసి శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ బుద్ధ వెంకన్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్బంగా వర్ల రామయ్య మాట్లాడుతు 1982 విజయవాడలో నేను పోలీస్ ఆఫీసర్గా పని చేశాను.
టిడిపిలో ఎంతమంది బీసీ నాయకులు అధికారాన్ని చేపట్టారు.. బుద్ధ వెంకన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గం సుభిక్షంగా ఉంటుంది.. నేను రావాలని ఎప్పుడూ కోరుకోలేదు..అనుకొని పరిస్థితుల్లో నాకు రాజ్యసభ దక్కలేదు..దళిత వర్గానికి చెందిన నాయకుడిగా నాకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది..
అలాగే వెనుకబడిన వడ్డెర వర్గానికి చెందిన ఒక మహిళను ఎమ్మెల్సీగా చేయడం అది ఒక చంద్రబాబు నాయుడు కి సాధ్యం.. అన్నారు.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి పశ్చిమ నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు.

చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు బీసీల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ, వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పిస్తున్నారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా డివిజన్ స్థాయి నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహించే గొప్ప అవకాశం లభించిందన్నారు.

పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి డివిజన్‌లో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని బుద్ధా వెంకన్న కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పార్టీ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా కృషి చేయాలని సూచించారు.

“బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో కి పాలభిషేకం చేసి, పశ్చిమ నియోజకవర్గం తరఫున మరోసారి ధన్యవాదాలు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని బుద్ధా వెంకన్న అన్నారు.

ఈ కార్యక్రమంలో నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్, MD ఫతావుల్ల, SK ఆశ, కొట్టేటి హనుమంత రావు, కామ దేవరాజు, మరియు డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి ఇంచార్జ్‌లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *