Breaking News

వైసీపీ నేతలు, జగన్ రెడ్డి వైఖరిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

-చట్టసభలను గౌరవించని వ్యక్తి చట్టసభల్లో ఉండడం అవసరమా?
-జగన్ బయట ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు… దమ్ముంటే అసెంబ్లీకి రావాలి
-ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా అడ్డుకోవాలని చూడడం సిగ్గుచేటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చట్ట సభలకు రాకుండా ప్రెస్ మీట్ల పేరుతో బురద జల్లడం జగన్ రెడ్డి మానుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. గత మూడు రోజులుగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అర్ధవంతంగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల్ని మోసం చేస్తూ.. జగన్ రెడ్డి కనీసం చట్ట సభలకు కూడా రాకపోవడం సిగ్గుచేటు. పైగా ప్రెస్ మీట్లు, ధర్నాలు అంటూ చట్ట సభల గౌరవాన్ని అపహాస్యం చేస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్దరించాం. మెగా డీఎస్సీపై వారు చేస్తున్న ఆరోపణలకు స్ఫష్టంగా సమాధానమిచ్చాం. వైసీపీ హయాంల జరిగిన ఏపీపీఎస్సీ అవకతవకలపైనా ప్రజలకు స్పష్టత ఇచ్చాం. యువతకు ఉద్యోగాలు కల్పించాలి. ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దిగజార్చిన జగన్ రెడ్డి.. ఇప్పుడు చట్ట సభలకు రాకుండా ప్రెస్ మీట్ల పేరుతో హడావుడి చేస్తున్నారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమని శాసనమండలిలో మేము చెబుతున్నప్పటికీ.. వినకుండా.. సభను అడ్డుకుంటున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల్ని సద్వినియోగం చేసుకోవడం లక్ష్యంగా సన్నాహాలు చేస్తున్నాం. రిజర్వేషన్లు సరిచేసి బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలనుకోవడం, చట్ట సభలను అపహాస్యం చేస్తున్నవారు రాజకీయాల్లో ఉండడం అవసరమా? వైస్ ఛైర్మన్ ఎన్నికలకు రాలేదని మాట్లాడుతున్న వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నా.. స్పీకర్ ఎన్నిక సమయంలో మీరు ఎక్కడున్నారు? వైస్ ఛైర్మన్ పదవికి నిలబడిన వ్యక్తి సమర్ధవంతమైన వ్యక్తి కాదు కాబట్టే ఎన్నికకు దూరంగా ఉన్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *