Breaking News

బీసీల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కూటమి ప్రభుత్వానిదే

-34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు ధన్యవాదాలు
-భవిష్యత్తులోనూ బీసీలకు అన్నిరకాలుగా అండగా నిలుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు అని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చినా.. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి అసలైన స్వాతంత్రం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారి, కరణం మనసబు వ్యవస్థలు రద్దు చేసిన
ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించి సామాజిక గౌరవం కల్పించారు. చంద్రబాబు వచ్చాక బీసీ రిజర్వేషన్లను 34 శాతం చేశారు. 1995 నుండి 34 శాతం రిజర్వేషన్లు అమలవుతుంటే.. జగన్ రెడ్డి కుట్ర చేసి 24 శాతానికి కుదించాడు. దాదాపు 16,800 మందికి రాజకీయ అవకాశాలు లేకుండా చేశారు. టిడిపిలోని బీసీలను అణచివేసే లక్ష్యంతో తప్పుడు కేసులు పెట్టాడు.. హత్యలు చేశారు. కూటమి రెండేళ్ల పాలన బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటు అందిస్తున్నాం. భవిష్యత్తులోనూ బీసీ రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండా చట్టం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *