Breaking News

అర్బన్ ‘ఇ'(మీ) సేవ ఉద్యోగులకి ఇచ్చిన హామీ నెరవేర్చండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2003 సం:లో ప్రారంభించిన ‘ఇ’ సేవ వ్యవస్థలోని ప్రభుత్వ అర్బన్ ‘ఇ’ సేవ సెంటర్లలో గత 18 సంవత్సరాలనుండి విధులు నిర్వహించిన 607 మంది ఉద్యోగులను గత ప్రభుత్వం అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించింది. వారికి యువగళం పాద యాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం తిరిగి ఉద్యోగాలు కల్పించాలని కోరతూ ఇ సేవా రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు CPI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి G. ఈశ్వరయ్య పాల్గొని ఇ సేవ ఉద్యోగుల పోరాటానికి మద్దతు పలికారు.
ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు పనిచేసిన ఉద్యోగులను జగన్ మోహన్ రెడ్డి తీసేయడం దుర్మార్గం అయితే, హామీ ఇచ్చి కూడా తిరిగి విధుల్లోకి తీసుకోక పోవడం చంద్రబాబు ది ఇంకా పెద్ద దుర్మార్గం అని అన్నారు. ప్రభుత్వాలకు ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తూ.ప్రభుత్వ శాఖలకు ఆదాయం తెచ్చిన ఉద్యోగులను 18 ఏండ్ల తరువాత రోడ్డు మీద పడేస్తే వారి కుటుంబాలు ఎలా బ్రతకాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాబట్టి నారా లోకేష్ ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకుని వారికి ఉద్యోగాలు కల్పించాలని లేదా భవిష్యత్తులో ఇ సేవ ఉద్యోగులు చేసే పోరాటాలకు CPI పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చి అవసరం అయితే వారికోసం మేము కూడా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతామని ప్రభుత్వాన్ని హేచ్చరించారు.
ధర్నాకు మద్దతు ప్రకటించిన వారిలో ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తి దారుల సంఘము అధ్యక్షులు కామ్రేడ్ తాడి పైడియ్య ఉన్నారు. ధర్నాలో రాష్ట్ర కమిటి సభ్యులు రవికిరణ్, వీరేంద్ర, నాగమణి, సునీత, రాజకుమార్, గౌరీశ్వరరావ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *