Breaking News

రేర్ ఎర్త్ మినరల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మారుస్తాం

– పర్మినెంట్ మేగ్నెట్స్ స్థానికంగానే తయారు చేసేలా చర్యలు
– ఏపీ సముద్ర తీరంలో అపారమైన వనరులున్నాయి
– రేర్ ఎర్త్ మినరల్స్‌పై ఏపీలో ప్రత్యేక కోర్సులు ప్రారంభించాలి
– మంత్రి కొల్లు రవీంద్రకు ప్రతిపాదనలు అందించిన ఏయూ ప్రొఫొసర్ల బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశ మైనింగ్ రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపుదామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు అటామిక్ ఎనర్జీ మాజీ శాస్త్రవేత్త ఆచార్య యుగంధర్ రావు బృందం సచివాలయంలోని మంత్రి చాంబర్లో కలిసి ప్రతిపాదనలు అందించారు. విమానాలు, ఈవీ వాహనాలు, రక్షణరంగ వాహనాల తయారీకి వినియోగించే సూపర్ మెటల్ మినరల్స్ వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విన్నవించారు. రేర్ ఎర్త్ మినరల్స్ మీద వర్సిటీల్లో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడితే భవిష్యత్తు మొత్తం ఏపీదేనన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేర్ ఎర్త్ మినరల్‌ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం పెంచడంతో పాటుగా, ఖనిజాలను సమృద్ధిగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఖనిజాలు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఏపీ సముద్రతీరంలో ఇల్లిమనైట్, రూటాయిల్, జిర్కాన్, గార్నెట్, సిలిమినైట్ అండ్ మోనజైట్ అపారంగా ఉన్నాయి. ఈ వనరుల వెలికితీతను కేవలం ప్రభుత్వ రంగంలో నిర్వహించడం కాస్త కష్టతరమైనందున.. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. టెక్నాలజీ ప్రాసెసింగ్ ఫీల్డ్‌లో చైనా చాలా ముందు ఉంది. తర్వాతి స్థానంలో జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ప్రత్యేకంగా రేర్ ఎర్త్ మినరల్స్, పర్మినెంట్ మేగ్నెట్స్ విషయంలో ఏపీలోని యూనివర్శిటీల్లో ప్రత్యేక కోర్సులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అదే సమయంలో నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీ 2026 ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి స్థానికంగా రేర్ ఎర్త్ మినరల్స్, పర్మినెంట్ మేగ్నెట్స్ విషయంలో ప్రత్యేక కోర్సులు ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు .త్వరలోనే ఐఆర్ఈఎల్ కేంద్రాన్ని పరిశీలించేలా చొరవ తీసుకుంటామని మంత్ర కొల్లు రవీంద్ర తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ యుగంధర్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ డా.హెచ్.పురుషోత్తం గారు, ప్రొ.వేణుబాబు గారు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *