Breaking News

ఐటీడీపీ డిజిటల్ సైనికులు సమిష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి… : బుద్ధా వెంకన్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో నియోజకవర్గ ఐటీడీపీ (ITDP) సభ్యులతో గురువారం ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న ఐటీడీపీ సభ్యులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ మరియు పార్టీ సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రతి ఇంటికీ, ప్రతి వ్యక్తికీ తెలిసే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో డివిజన్ స్థాయి నుంచి ఐటీడీపీని బలోపేతం చేయాలని, డిజిటల్ వేదికలపై పార్టీ విజయాల కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు మధురాంతకం సాయి చైతన్య, ప్రధాన కార్యదర్శి బోగవల్లి రమేష్, ఉపాధ్యక్షులు ఎన్ రెడ్డి గౌరీ, బొల్లు అనుదీప్, అధికార ప్రతినిధి సతీష్ కుమార్, జిల్లా ఐటీడీపీ నాయకులు పుప్పాల దుర్గ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు బండారు దుర్గారావు, కొత్తమల్ రాజు, కార్యదర్శులు అమర మల్లేశ్వరి, షేక్ మునీర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *