మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన కలెక్టర్ జె. నివాస్

-మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటేనని చాటిచెప్పిన మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 131వ వర్ధంతి సందర్భంగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జ్యోతిరావు పూలే చిత్రపటానికి కలెక్టర్ జె. నివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే ఆని కలెక్టర్ జె. నివాస్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం, మహిళా అభ్యున్నతికి పోరాడిన తత్వవేత్త, విద్యావేత్త మహాత్మా జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలను రూపుమాపాలని అందరితో పాటు మహిళలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షిస్తూ ఆదిశగా పూలే ఎంతో పాటు పడ్డారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) కె.మోహన్ కుమార్,బిసి సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్. లక్ష్మీ దుర్గా తదితరులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *