Breaking News

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం

-గ్రంథాలయ సెస్ నిధులను నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థలకు జమ చేయడం చారిత్రాత్మక నిర్ణయం – 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు స్వాగతించదగినవి…
-ఎం. ఎస్ బేగ్ చైర్మెన్ జిల్లా గ్రంథాలయ సంస్థ, ఉమ్మడి కృష్ణా జిల్లా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చైర్పర్సన్ బేగ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించి చేసిన కీలక ప్రకటనలను హృదయపూర్వకంగా అభినందించారు. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గ్రంథాలయ సెస్ ద్వారా వచ్చే నిధులను నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థల ఖాతాలకు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించడం పట్ల చైర్పర్సన్ ఎం. ఎస్ బేగ్ ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులు సకాలంలో అందుబాటులోకి వస్తే, జిల్లా మరియు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలను మరింత మెరుగైన స్థాయిలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే గ్రంథాలయాలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై మంత్రి చేసిన ప్రకటనలు రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమానికి నూతన దిశను చూపిస్తున్నాయని ఆమె అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే ఆధునిక గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, పాఠకులు, పరిశోధకులు ఎంతో ప్రయోజనం పొందుతారని ఎం. ఎస్ బేగ్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు, వార్తాపత్రికలు, పత్రికలు, డిజిటల్ వనరులు మరియు ప్రశాంతమైన చదువుకునే వాతావరణం అందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అలాగే గ్రంథాలయాల అభివృద్ధి బాధ్యతను గ్రంథాలయ సంస్థల చైర్పర్సన్లు మరియు సంబంధిత బాధ్యులపై ఉంచి, వాటి పనితీరును మెరుగుపరచాలని మంత్రి సూచించడం పుస్తకాలు చదివే ప్రదేశాలుగా కాకుండా, విద్య, కూడా స్వాగతించదగిన పరిణామమని ఆయన అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన గ్రంథాలయ సేవలు అందించేందుకు చైర్పర్సన్లు, అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రంథాలయాలను కేవలం విజ్ఞాసం, ఉపాధి, పోటీ పరీక్షల తయారీ, డిజిటల్ విద్య మరియు యువత అభివృద్ధికి కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని బేగ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రంథాలయ సెస్ నిధులను నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థలకు అందించడం వల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించి గ్రంథాలయ భవనాలు, ఫర్నిచర్, పుస్తకాలు, కంప్యూటర్లు, డిజిటల్ సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, పఠన మందిరాలు తదితర మౌలిక వనతులను మరింత మెరుగుపరచడానికి అవకాశం కలుగుతుందని ఆమె తెలిపారు.
“రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే ఆధునిక గ్రంథాలయం ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారం కావాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో గ్రంథాలయ రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తాము” అని ఛైర్మెన్ ఎం. ఎస్ బేగ్ తెలిపారు. గ్రంథాలయాల బలోపేతానికి ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల ముఖ్యమంత్రి కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఉమ్మడి కృష్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఎం. ఎస్ బేగ్ కృతజ్ఞతలు తెలియచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *