అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి డిఎస్‌సి-98 (ఎంటిఎస్) టీచర్స్ ఫెడరేషన్ మినిమం టైమ్ స్కేల్ (ఎంటిఎస్) ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచాలని ఐదుగురు ఎమ్మెల్సీలకు మెమోరాండం ఇచ్చి లోకేష్ వద్ద నుండి భరోసా తీసుకోవడం జరిగింది. ఈరోజు శాసనసభ లాబీలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని, ఎమ్మెల్సీలైన వేపాడ చిరంజీవిని, పేరాబత్తుల రాజశేఖర్‌ని ప్రస్తుతం వరకు కలిసి మన సమస్యలపై వినతి చేయగా ఐదుగురు ఎమ్మెల్సీల సంతకాలతో మాకు 62 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు పెంపుదల, రెగ్యులర్ కొరకు వినతి పత్రం లోకేష్‌కి అందచేశారు. లోకేష్ తప్పక వారికి న్యాయం చేద్దామని మాకు హామీ ఇచ్చి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. మాకు కొద్ది కాలంలోనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, దీనికి సంబంధించి ఫైల్ సర్కులేషన్, జీఓఎం, క్యాబినేట్ అప్రూవ్ కావాలి అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.కేశవకుమార్, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, ఆర్థిక కార్యదర్శి రాజగోపాల్‌నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్.రామాంజనేయులు, ఫెడరేషన్ సభ్యులు వున్నారు.
Prajavartha Online Telugu News