Breaking News

శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధ వెంకన్న, రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కె. నాగుల్ మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 27 మంది నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా పోతిన బేసు కంటేశ్వరుడు, గౌరవ అధ్యక్షుడిగా రాయన ఆదిబాబు, కార్యదర్శిగా తొత్తడి భారత్, కోశాధికారిగా బెవర సాయి సుధాకర్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎంపి శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ సమాజ సేవలో భాగస్వాములైన నగరాల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులని అభినందించారు. స్వాతంత్ర సమరయోధుడు మరుపిళ్ళ చిట్టి ఆశయాలను కొనసాగిస్తామని చిట్టినగర్ సెంటర్లోని ఆయన విగ్రహాన్ని మరింత ఘనంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నగరాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతో పాటు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నగరాల కులస్తుల అభివృద్ధితో పాటు అందరి అభివృద్ధి కోసం కలిసిమెలిసి ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి రాజకీయాలకతీతంగా సేవలందిస్తున్నానన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని ఆ తర్వాత అందరం ఒకటేనన్నారు. కులమతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా, సేవలందించడమే తన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ డిమాండ్ చేసి పనిచేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జి, బాయన వెంకట్రావు, ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ, వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్, దుర్గమ్మ గుడి, మాజీ చైర్మన్ పైలా సోమి నాయుడు, మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ , చెన్నుపాటి శ్రీనివాస్, బొమ్మసాని సుబ్బారావు, గుజ్జారీ అమర్, కరణం దివాకర్, సుకాసి కిరణ్, సుకాసి సరిత, భక్తులు, నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *