Breaking News

భక్తుల సౌకర్యమే మా మొదటి ప్రాధాన్యత

-అన్నప్రసాదo, లడ్డు పోటు భవనాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే విప్ యార్లగడ్డ వెంకటరావు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, ఆలయ చైర్మన్ అధికారులు సిబ్బందితో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)
-ముఖ్యమంత్రి సహకారంతో నే లడ్డు పోటు అన్నప్రసాద భవనాలు నిర్మాణం
-నూతన రాజధాని అమరావతిలో అమ్మవారి ఆలయం ప్రత్యేక పాత్ర పోషించనుంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దశాబ్ద కాలం నుంచి ఎదురుచూస్తున్న అన్న ప్రసాద భవనం లడ్డు పోటు భవనాలు ప్రారంభోత్సవం నేడు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, ప్రభుత్వ విప్ ప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అమ్మవారి ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈవో శీనా నాయక్ మరియు ఇతర అధికారులు ఆలయ సిబ్బంది తో కలిసి ఎంపి కేశినేని చిన్ని పాల్గొన్నారు. ముందుగా అన్న ప్రసాద భవనాన్ని, తరువాత లడ్డు పోటు భావనాలను ప్రజాప్రతినిధులు అధికారులు అంతా కలిసి పరిశీలించి అనంతరం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) మాట్లాడుతూ ముందుగా శ్రావణ శుక్రవారం రోజున అన్న ప్రసాద భవనం లడ్డు పోటు భవనాలను ప్రారంభించడం శుభ పరిణామం అని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం తో ఈ రోజు ఈ రెండు భవనాలు నిర్మాణం చేసుకున్నాం అని ఈరోజు అన్న ప్రసాదం భవనం, లడ్డు పోటు భవనాలు ప్రారంభించుకోవడం జరిగింది అని తెలిపారు సుమారు 53 కోట్ల రూపాయిల నిధులతో ఈరోజు రెండు భవనాలను ప్రారంభించుకున్నామని ఈరెండు భవనాలు అమ్మవారి ఆలయానికి ఒక కానుక గా భావిస్తున్నాం అని అన్నారు దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారి ఆలయం పై ప్రత్యేక దృష్టి పెట్టారు అని అందుకే ఈ రెండు భవనాల నిర్మాణం ఇంత త్వరితగతిన చేపట్టగలిగామని కూటమి ప్రభుత్వ సహకారంతో చేపట్టిగలిగామని అన్నారు

అమ్మవారి ఆలయం గత 4 నెలలుగా రాష్ట్రం లోని అన్ని దేవాలయాల్లో 1వ స్థానం సాధించింది అని దేవాదాయ శాఖ ఉద్యోగులు అందరు కలిసికట్టుగా పనిచేసారు కాబట్టే సాధ్యపడింది అని తెలిపారు భక్తుల సౌకర్యమే మా మొదటి ప్రాధాన్యత అని నిర్మితమవుతున్న రాజధాని అమరావతి లో ఈ అమ్మవారి దేవస్థానం ప్రత్యేక పాత్ర పోషించబోతుంది అని అన్నారు ప్రారంభించిన భవనాల ద్వారా 60 వేల లడ్డులు ఒక గంటలకు తయారు కానున్నాయి అని ఒకే సారి 10 వేల మందికి ఒక గంటల లో భోజనం చేసే సౌకర్యం ఏర్పాటు చేసాము అని అన్నారు రాబోయే దసరాకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాము అని దసరా ను అంగరంగ వైభవంగా జరిపిస్తాం అని కూటమి ప్రభుత్వo ఆధ్వర్యంలో లోనే దేవాలయాల అభివృద్ధి జరుగుతుంది అని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *