హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో పద్మ విభూషణ్ డా. కొణిదెల చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. కళారంగం, సినీ రంగం ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పద్మ విభూషణ్ డా. కొణిదెల చిరంజీవి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి గారు తన అద్భుతమైన నటనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో చిరంజీవి చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, సామాజిక రంగ ప్రముఖులు, అభిమానులు మరియు చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు పాల్గొని పద్మ విభూషణ్ డా. కొణిదెల చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News