విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని మినర్వా గ్రాండ్‌లో నిర్వహించిన వస్త్రాలత 90వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న ముఖ్య అతిథిగా హాజరైనారు .
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ వస్త్రాలత నేటితో 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఒకప్పుడు విజయవాడను చిన్న బొంబాయి గా పిలిచే స్థాయిలో వ్యాపార రంగం అభివృద్ధి చెందడానికి వస్త్రాలత వంటి సంస్థలు, వ్యాపారుల కృషి ఎంతో ఉందన్నారు. వస్త్రాలత కేవలం వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాకుండా, కులమతాలకు అతీతంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అనేక కుటుంబాలకు అండగా నిలిచిందని బుద్ధా వెంకన్న గారు కొనియాడారు. ఎన్నో దశాబ్దాలుగా వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు, వినియోగదారులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్త్రాలత తన ప్రత్యేకతను నిలబెట్టుకుందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాపార రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ముఖ్యంగా ఆన్‌లైన్ వ్యాపారం విస్తరించడం వస్త్రలత వ్యాపారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
వస్త్రాలత వ్యాపార రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తరఫున ఏదో ఒక విధంగా సహాయం అందించేలా తన వంతు కృషి చేస్తానని బుద్ధా వెంకన్న గారు హామీ ఇచ్చారు. వ్యాపారుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విజయవాడ వస్త్రాలత వ్యాపార రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తే నగరంలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని, స్థానిక వ్యాపారులు బలోపేతం అయితే వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. 90 ఏళ్ల ఘన చరిత్రను కొనసాగిస్తూ వస్త్రాలత భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని, విజయవాడ వ్యాపార రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని బుద్ధా వెంకన్న ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఓలేటి జగన్మోహన్, ఎస్ శివ, కొత్త ఆనంద్ పొన్నూరు రామ్ కుమార్ , మద్ది సుబ్బారావు గొల్ల రామచంద్ర, వివికె నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News