విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చుట్టుగుంటలో ముత్యాలమ్మ తల్లి 38వ బోనాల సంబర మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయులు బొండా రవితేజ, 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కనులపండువగా బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్య అతిథులను ఆలయ అధ్యక్షులు కోసరం రాములు శాలువా కప్పి, టోపీ పెట్టి, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాలతో చుట్టుగుంట ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Prajavartha Online Telugu News