న్యూఢిల్లీ ఏపీ భవన్‌లోని పురాతన శివాలయం, కనకదుర్గమ్మ మందిరాన్ని పరిశీలించిన దుర్గగుడి ఈవో వి.కె. శీనా నాయక్

ఇంద్రకీలాద్, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో గల పురాతన శివాలయాన్ని, అలాగే శ్రీ కనకదుర్గా దేవి మందిరాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆదివారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​న్యూఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయ సూచనలు, మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఏపీ భవన్ ఎస్టేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పురాతన శివాలయాన్ని దేవస్థానం ఈవో క్షుణ్ణంగా పరిశీలన చేశారు.

చాలా సంవత్సరాలనుండి ​ అనధికారిక వ్యక్తుల చేతిలో ఉన్న ఈ ఆలయం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ భవన్ పరిధిలోకి వచ్చిన ఈ పురాతన శివాలయం విజయవాడ అమ్మవారి ఆలయంనుండి నిత్య కైంకర్యాలు, అర్చనాది పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా దేవస్థానం తక్షణ చర్యలు చేపట్టిందని ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈ శివాలయం అభివృద్ధి రీత్యా ​నూతన శాశ్వత అర్చకుడిని నియమించే వరకు, ప్రస్తుతం ఏపీ భవన్‌లోని శ్రీ కనకదుర్గా దేవి మందిరంలో అర్చక విధులు నిర్వహిస్తున్న అర్చకస్వామిని ఈ శివాలయంలో కూడా నిత్య కైంకర్యాలు నిర్వహించేందుకు అదనపు బాధ్యతలు అప్పగించామని ఈవో తెలిపారు. ఈ శివాలయంలో ​పూజా ద్రవ్యాలు, ఇతర సామాగ్రిని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం సమకూరుస్తుందని, ఢీల్లీ
​శివాలయంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పూజాదికాలు నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ మరియు స్థానాచార్యుల అభిప్రాయాలు, సలహాలు తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని ఈవో శీనా నాయక్ తెలిపారు.

​అనంతరం ఏపీ భవన్ ప్రాంగణంలో ఇంద్రకీలాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి మందిరాన్ని ఈవో దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో కొలువైన మన కనక దుర్గ అమ్మవారి మందిరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్, దేవాదాయ శాఖ కమిషనర్ వారికి పూర్తి వివరాలు తెలియజేసి, వారి మార్గదర్శకత్వంలో తదుపరి అభివృద్ధి కార్యాచరణను ప్రారంభిస్తామని వెల్లడించారు.

​ఈ పరిశీలన కార్యక్రమంలో ఢిల్లీ ఏపీ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *