రాలిస్‌ నుంచి రెండు నూతన పంట సంరక్షణ ఉత్పత్తులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు ఎదుర్కొంటున్న పంట వ్యాధులు, పురుగు సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే లక్ష్యంతో టాటా గ్రూప్‌కు చెందిన రాలిస్‌ ఇండియా లిమిటెడ్‌ రెండు నూతన పంట సంరక్షణ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. విజయవాడ లబ్బీపేటలోని జీఆర్‌టీ హోటల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘మార్సెలస్‌’, ‘సైలెంట్రా’ ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాలిస్‌ ఇండియా ఎండీ, సీఈఓ డా. జ్ఞానేంద్ర శుక్లా మాట్లాడుతూ, మారుతున్న పంట రక్షణ సవాళ్లకు అనుగుణంగా వినూత్న పరిష్కారాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు. మార్సెలస్‌, సైలెంట్రా ఉత్పత్తులు రైతులకు మెరుగైన పంట రక్షణ అందించడంతో పాటు పంట ఆరోగ్యం, ఉత్పాదకతను కాపాడటంలో సహాయపడతాయని తెలిపారు.రాలిస్‌ ఇండియా క్రాప్‌ కేర్‌ బిజినెస్‌ హెడ్‌ రాహుల్‌ పాండే మాట్లాడుతూ, శాస్త్రీయ సాంకేతికత ఆధారంగా ఆధునిక వ్యవసాయ పరిష్కారాలను రైతులకు అందించాలన్న సంస్థ నిబద్ధతకు ఈ రెండు ఉత్పత్తులు నిదర్శనమన్నారు.
కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌–సప్లై చైన్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అశ్వని మహాజన్‌, సేల్స్‌ హెడ్‌ పి. రాజా, హెడ్‌–ఫీల్డ్‌ మార్కెటింగ్‌ వై. రవి కృష్ణ, డివిజనల్‌ సేల్స్‌ మేనేజర్లు వసంత శంకర్‌ రెడ్డి, వెంకట్‌ రామి రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాలిస్‌ ఇండియా సేల్స్‌ బృందం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *